England star cricketer Moeen ali Retires from test cricket
#MoeenAli
#CSK
#Ipl2021
#ECB
#JoeRoot

ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్, చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్ మొయిన్ అలీ.. టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ఇచ్చాడు. రాబోయే యాషెస్ 2021 సిరీస్ సమయంలో మొయిన్ అలీ రిటైర్మెంట్ ప్రకటించే అవకాశాలున్నాయని బ్రిటిష్ మీడియా పేర్కొనగా.. అంతకుముందే అలీ టెస్ట్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. వైట్-బాల్ ఫార్మాట్లలో తన కెరీర్‌ను సుదీర్ఘ కాలం కొనసాగించేందుకే.. అలీ టెస్ట్ క్రికెట్ నుంచి తప్పుకున్నాడట. తాను రిటైర్ అవుతున్న విషయాన్ని మొయిన్ అలీ గతంలోనే ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్, హెడ్ కోచ్ క్రిస్ సిల్వర్‌వుడ్‌కు తెలిపాడట. వారితో పాటు ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) ఒప్పుకోవడంతో.. తాజాగా మొయిన్ అలీ అధికారకంగా తన నిర్ణయాన్ని ప్రకటించాడు.